మేము ఎలా లెక్కిస్తాము
జాతకం లెక్కిస్తాం — ఎక్కడినుండో తీసుకోము
శుభ జాతకంలో ప్రతి జాతకం జన్మ తేదీ, సమయం, స్థలం ఆధారంగా మీ ఫోన్‌లోనే లెక్కించబడుతుంది. మరే వెబ్‌సైట్ నుండీ ఏమీ తీసుకోము; మీ వివరాలు మా సర్వర్‌కు వెళ్ళవు.
1. గ్రహాలు ఎక్కడ ఉన్నాయి
జన్మ క్షణంలో సూర్యుడు, చంద్రుడు, గ్రహాల ఖచ్చితమైన స్థానాలను astronomy-engine అనే ఓపెన్ సోర్స్ ఖగోళ లైబ్రరీతో లెక్కిస్తాం. తర్వాత భారత ప్రభుత్వం స్వీకరించిన లాహిరి అయనాంశతో నిరయన స్థానాలకు మారుస్తాం (దృక్ గణితం).
2. ఆకాశం నుండి జాతకంగా
మా స్వంత కోడ్ లగ్నం, రాశి, భావాలు, నక్షత్రం, పాదం, నవాంశ, తిథి, యోగం, కరణం, వింశోత్తరి దశ–అంతర్దశ, దోషాలు, జన్మ స్థలంలోని నిజమైన సూర్యోదయం ప్రకారం పంచాంగం — అన్నీ లెక్కిస్తుంది.
3. క్యాలెండర్ మరియు పొంతన
తెలుగు మాసాలు — అమాంత చాంద్రమానం, అధిక మాసం సహా; సంవత్సరం — 60 సంవత్సరాల చక్రం, శాలివాహన శకం. పొంతన — 36 గుణాల అష్టకూటం (నాడీ, భకూట దోష పరిహారాలతో), దక్షిణాది 10 పొరుత్తాలు.
4. ఎంత ఖచ్చితం?
1900–2060 మధ్య 400 జాతకాలను Swiss Ephemerisతో పోల్చాం: గ్రహ స్థానాలు కొన్ని సెకన్ల లోపు; రాశి, నక్షత్రం, లగ్నంలో ఒక్క తేడా కూడా లేదు.
గణితం చెప్పలేనిది
లెక్క ఖచ్చితం; ఫలితం సంప్రదాయం. అయనాంశ, రాహు రకం, పొంతన నియమాలు సంప్రదాయాన్ని బట్టి మారతాయి. జ్యోతిష్యాన్ని మార్గదర్శకంగా తీసుకోండి.